మాకేంటీ ఖర్మ..యాంకర్ భాను శ్రీ పై ఓ రేంజ్ లో నెగిటివ్ ట్రోల్స్.!

తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ప్రోగ్రాములు మంచి ఈవెంట్ లు అంటే గుర్తొచ్చేది ఈటీవీ షోలు వాటి ఎంటర్టైన్మెంట్. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అయితే చెప్పి రుద్దిందే వాళ్ళు రుద్దేసి ఏవేవో వింత ప్రయోగాలు చేయిస్తున్నారు.

ఇప్పటికే వారి షో లలో కొన్ని అతి ఈవెంట్ లు చూసి సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి లేటెస్ట్ గా అయితే ఓ అంశం పెద్ద ఎత్తున ట్రోల్ మెటీరియల్ గా అయితే మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎన్నో సినిమాలు ప్లాప్ లు ఉన్నప్పటికీ తన సినిమాల ఆడీయో లు మాత్రం ఎప్పుడు ప్లాప్ అవ్వలేదు.

మరి అలాంటి చిత్రాల్లో తీన్ మార్ ఆల్బమ్ కూడా ఒకటి. మరి ఈ ఆల్బమ్ నుంచి మణిశర్మ ఇచ్చిన ఎమోషనల్ హిట్ ట్రాక్ “గెలుపు తలుపులే” సాంగ్ చాలా మందికి ఎంతో ఇష్టమైన పాట. మరి ఇలాంటి పాటల్ని టాప్ సింగర్స్ తోనో లేక ఒరిజినల్ గా పాడిన వారు పాడితే బాగుంటుంది కానీ..

వీరి ఈవెంట్ లలో అందులోని యాంకర్, నటి భాను శ్రీ తో పాడించడం ఏదైతే ఉందో అది పెద్ద ట్రోల్ గా మారిపోయింది. పవన్ ఫ్యాన్స్ అయితే అంత మంచి పాటని కూని చేసేశారని మాకేంటీ ఖర్మ అంటూ తల బాదుకుంటున్నారు. దీనితో నిన్నటి నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.