Mallana: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఈయన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీ పరువు ప్రతిష్టలను దిగదర్చే విధంగా ఈయన వ్యవహార శైలి ఉండడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈయనపై సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మల్లన్న పార్టీకి పూర్తిస్థాయిలో నష్టం తీసుకొచ్చేలా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలోనే గతంలో ఆయనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు కూడా ఇచ్చింది.
ఇలా మల్లన్నకు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం సమాధానం చెప్పకపోవడంతోనే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఈయన వ్యవహార శైలిని పూర్తిస్థాయిలో తప్పుపడుతూ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది ఇలా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీ గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.
కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడగానే ఎమ్మెల్సీ మల్లన్న గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనకు చెందిన యూట్యూబ్ చానల్ లో ఏం పీక్కుంటారో.. పీక్కోండి అని మల్లన్న వ్యాఖ్యానించారు. పులి బోన్ లో నుంచి బయటకు వస్తే ఎట్లా వేటాడుతాదో చూపిస్తారు అని ఈ వీడియోకి ట్యాగ్ లైన్ ఇచ్చారు.
రాష్ట్రంలోని ఓ సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా భావించే కులగణనపైనా వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో ఎమ్మెల్సీకి గత నెల 5న కాంగ్రెస్ ఈయనకు శోకాజు నోటీసులు జారీ చేసి ఫిబ్రవరి 12వ తేదీలోపు సమాధానం చెప్పాలని తెలిపారు. అయినప్పటికీ ఈయన మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో క్రమశిక్షణ కమిటీ ఈయనపై వేటు వేసింది.