Bhale Bhale Banjara : ‘భలే భలే బంజారా’ లిరికల్ వీడియో ఇదిగో!

Bhale Bhale Banjara : మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు స్టెప్పులేస్తూ ‘భలే భలే బంజారా’ అంటూ సాంగ్ తో వచ్చేశారు. త్వరలో విడుదల కానున్న ‘ఆచార్య’ లో కొత్త సాంగ్ ప్రమోషన్ విజువల్స్ సాంగ్ మేకింగ్ దృశ్యాలు కూడా కలుపుకుని వుంది.

లిరికల్ వీడియో ‘చీమలు దూరని చిట్టడివి’ అన్న పల్లవితో ప్రారంభమై, అద్భుతమైన పదాలతో క్లాస్ తో బాటు మాస్ ని ఆకాట్టుకునేలా వుంది.

చిరంజీవి, రామ్ చరణ్ లకి గాయకులు శంకర్ మహదేవన్, రాహుల్ సిపిల్‌గంజ్‌ల అద్భుత గానంతో ప్లే బ్యాక్ నందించారు. పాటకి చిరంజీవి, రామ్ చరణ్‌ల అసాధారణ స్టెప్పులు ఈలలు వేయించేలా వున్నాయి.

తండ్రీ కొడుకుల జంట విజువల్స్ ఎక్స్ ట్రా జోష్ నిచ్చాయి. మణిశర్మ మ్యూజిక్ డబుల్ ఎక్స్ ట్రా జోష్.

ఈ సాంగ్ తో ప్రేక్షకుల ఉత్కంఠ మరింత పెరిగింది. మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 29 వరకూ ఆగాల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ లో ఇంకా కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తుండగా, సినిమాటోగ్రఫీ టిర్రు, ఎడిటింగ్‌నవీన్ నూలి నిర్వహిస్తున్నారు.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అవనేష్ రెడ్డి నిర్మాతలు.

***

Bhale Bhale Banjara Lyrical-Acharya | Megastar Chiranjeevi, Ram Charan | Koratala Siva | Mani Sharma