Hello Movie Child Artist: ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మీకు పూర్తిగా తెలిస్తే షాక్ అయిపోతారు.. అసలు ఆ అబ్బాయ్ ఎవరంటే?

Hello Movie Child Artist: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు తన అద్భుతమైన నటన ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పలువురు పెద్దయిన తర్వాత హీరోలు గారి ఎంట్రీ ఇవ్వగా మరికొందరు వారికి నచ్చిన రంగంలోకి వెళ్లి దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే హలో సినిమా ద్వారా మనకు పరిచయమైన చైల్డ్ ఆర్టిస్ట్ మైఖేల్ గాంధీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైఖేల్ గాంధీ హలో సినిమాలో అఖిల్ చిన్నప్పటి పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు మైఖేల్ గాంధీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ పంచుకుందాం…

ఏడు సంవత్సరాల వయసులోనే మైఖేల్ గాంధీ సుప్రీమ్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.మైఖేల్ గాంధీ తెలుగు సినిమాలలో కన్నా శ్రీలంక పాకిస్తాన్ కి సంబంధించిన యాడ్స్ లో ఎక్కువగా కనిపించి సందడి చేశారు. మైఖేల్ గాంధీ ఎన్నో అద్భుతమైన యాడ్స్ లో నటించినప్పటికీ సినిమాలంటేనే ఎంతో ఇష్టమని చెబుతాడు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సచిన్ టెండూల్కర్ బయోపిక్ చిత్రం తీస్తున్న సమయంలో చిన్నప్పటి సచిన్ పాత్రలో మైఖేల్ గాంధీ నటించడం విశేషం.

అయితే ఎంతో ఎదురు చూసే ఈ మంచి అవకాశం తనకు ఊరికే రాలేదంట.. ఏకంగా వెయ్యి మందిని ఆడిషన్ చేస్తే ఆ వెయ్యి మందిలో మైకేల్ అవకాశాన్ని దక్కించుకున్నారు. బిలియన్ డ్రీమ్స్ సినిమా ప్రమోషన్ కి మైఖేల్ ఎక్కడికెలితే అక్కడ జనం మైఖేల్ గాంధీ ని చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇలా చిన్నప్పుడే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మైఖేల్ గాంధీ ఫ్యూచర్ లో ఒక స్టార్ హీరో అవుతాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదని చెప్పవచ్చు.