నా ఈ పరిస్థితికి కారణం ఆయనే.. పెళ్ళి సండD బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

హీరోయిన్ గానటించిన ఒక సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి వారిలో పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీలా కూడా ఒకరు. గౌరి రోణంకి దర్శకత్వంలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల జంటగా నటించిన చిత్రం పెళ్లి సందD. గతేడాది విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీ లీల తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీ లీల తను నటించిన మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.

ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. అయితే ఈరోజు తను ఈ పొజిషన్లో ఉండటానికి కారణం మాత్రం రాఘవేంద్ర గారు అంటూ చెప్పుకొచ్చింది. ఈరోజు ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకి మంచి గుర్తింపు లభించడానికి కారణమైన రాఘవేంద్రరావు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ శ్రీ లీల చెప్పుకొచ్చింది. శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయని సమాచారం. బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ, శర్వానంద్, నితిన్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. అయితే ఇండస్ట్రీలో ఎదగాలంటే అందం ఉంటే సరిపోదు.. నటన కూడా చాలా అవసరం అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. శ్రీ లీల ప్రస్తుతం రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలు తమ సినిమాలలో హీరోయిన్ గా శ్రీ లీల ఉండాలని కోరుకుంటున్నారు.