Health Tips: సూర్యాస్తమయం తర్వాత పండ్లు అస్సలు తినకూడదు.. తింటే ఏమౌతుంది?

Health Tips: సాధారణంగా ఎక్కువగా పండ్లును తినాలని మనకు పెద్దలు చెప్తుంటారు.. ప్రతి రోజూ పండ్లను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిన అయితే పండ్లను తినటానికి కూడా సరైన సమయం ఉంటుందనిఅయితే పండ్లను తినటానికి కూడా సరైన సమయం ఉంటుందని ఆ సమయంలోనే తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ పండ్లను కొన్ని సమయాలలో తినడం వల్ల కూడా ఎంతో ప్రమాదమట.. అది ఏంటో తెలుసుకుందాం..

సూర్యాస్తమయం తరువాత పండ్లు తినడం వల్ల ఆరోగ్యనికి హనికరం అని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనికి కారణం సూర్యస్తమయం తరువాత ఆహారంలో వచ్చే మార్పులు. ఇది పండ్లలో కూడా జరుగుతుందని ఆయుర్వేద నిపుణుల చెప్తుంటారు.ఈ సమయంలో పండ్లలలో ఉన్న పోషకాలు నశిస్తాయి. అంతే కాకుండా సూర్యస్తమయంలో తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వ్యాప్తి చెందుతుంది. అందువల్ల రాత్రిపూట పండ్లను తీసుకోకూడదు అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

 

పండ్లను తినడానికి సరైన సమయం ఉదయం. అయితే ఒకేసారి అన్ని పండ్లు తినకుండా ఒకటే రకమైన పండ్లు మాత్రమే తీసుకుంటే మంచిది. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి ఆ పండ్ల నుండి మంచి పోషకాలు అందుతాయి. అంతేకాదు శరీరానికి కావాల్సినంత బలం చేకూరుతుంది. కనుక పండ్లను తీసుకోవడానికి రాత్రి సమయం అనువైనది కాదని అయితే భోజనం చేసిన తర్వాత కూడా వెంటనే కాకుండా అరగంట తరువాత పండ్లను తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.