ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటికి రావాలి అంటేనే భయపడుతున్నారు. అయితే వేసవి కాలం వచ్చింది అంటే మనకు ఎక్కువగా కర్బూజా మామిడి, కళింగర దోసకాయ లాంటి పండ్లు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా దోసకాయ కర్బూజా, కలింగరా లాంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఇందులో కర్బూజా విషయానికి వస్తే..ఈ కర్పూజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ గింజలు తరచూ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఇన్ఫెక్షన్ లను దూరం చేసుకోవచ్చు. ఇవి ఒమేగా త్రీ ఫ్యాటీ కలిగి ఉంటాయి. ఒమేగా 3లు మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రసిద్ధి చెందాయి. కర్బూజ గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సాయపడే శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. అలాగే కర్బూజలో ఉండే అధిక మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ఎముకలను బలోపేతం చేసే ఇలాంటి ఆహారాలు బోలు ఎముకల వ్యాధి వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.
అలాగే కర్బుజాల్లో ఉండే విటమిన్ ఏ,సి,ఈ విటమిన్స్ మీ చర్మ ఆరోగ్య ని మెరుగుపరుస్తాయి. ఈ పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం వృద్ధాప్యాన్ని మరింత ఆలస్యం చేస్తాయి. తద్వారా యవ్వనంగా ఉండవచ్చు. కర్బూజ గింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. మీ ఆహారంలో తగినంత డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అది క్రమంగా ప్రేగు కదలికను సులభతరం చేసేలా చేస్తుంది. మలబద్ధకం బాధితులు ఈ గింజలను తింటే మలబద్ధకం రాకుండా ఉంటుంది.