కన్నడ సోయగం రష్మిక మందన్న తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా భారీ సినిమాలతో బిజీబిజీగా మారింది. మరో ఏడాది పాటు ఈ అమ్మడి డేట్స్ ఖాళీ లేవు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో ఆరు సినిమాలున్నాయి. వీటి షూటింగ్స్ మొత్తం పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందంటున్నారు. దాంతో ఈ భామ డేట్స్ కావాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే.
ప్రస్తుతం రష్మిక మందన్న తెలుగులో ‘పుష్ప-2’, ‘రెయిన్‌బో’, ‘గర్ల్‌ఫ్రెండ్’,’కుబేర’ చిత్రాల్లో నటిస్తున్నది. ‘పుష్ప-2’ చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా..మిగిలిన మూడు చిత్రాలు షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఇక బాలీవుడ్‌లో ‘యానిమల్’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఈ సొగసరికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ‘సికిందర్’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌తో జోడీ కట్టబోతున్నది. విక్కీకౌశల్‌తో ‘ఛావా’ సినిమాలో నటిస్తున్నది. హిందీలో మరికొన్ని ఆఫర్లొచ్చినా..డేట్స్ ఖాళీలేని కారణంగా రష్మిక అంగీకరించలేదని అంటున్నారు. మొత్తంగా చూస్తే మరో ఏడాది పాటు రష్మిక మందన్న డేట్స్ దొరకడం కష్టమేనట!