Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం`భీమ్లానాయక్` మరో నాలుగు రోజుల విడుదల అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది చిత్ర యూనిట్, దీనికి సంబంధించి తాజాగా మరో అప్‌డేట్‌ని కూడ విడుదల చేసింది. అన్ని సినిమాల్లాగా ఈ సినిమాకి ప్రత్యేకంచి ప్రమోషన్ కార్యక్రమాలు అవసరం లేదు. కారణం పవన్ కల్యాణ్ సినిమా కావడమే.
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఈ రోజు సాయంత్రం నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరూ రావడం లేదంటూ ముందుగా వార్తలు వినిపించినా… తాజా ఈ పోగ్రామ్‌కు విచ్చేస్తున్న అతిథి పేరు ప్రకటించి చిత్ర బృందం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదేంటంటే ఈ ఈవెంట్‌కి గెస్ట్‌గా తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కాబోతున్నట్టు వెల్లడించడంతో సినీ, రాజకీయ వర్గాల్లో పలు చర్చలు ప్రారంభమయ్యాయి.
పర్సనల్‌గా కేటీఆర్‌కి, పవన్‌కి మంచి స్నేహమే ఉన్నా, రాజకీయాల పరంగా మాత్రం కొంచెం అభిప్రాయ బేధాలు ఉన్నాయని అనడంలో మాత్రం సందేహం లేదు. కారణం జనసేన, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని సపోర్ట్ చేయడమే. అయితే వీరిద్దరి మధ్య పొలిటికల్‌గా ఎలాంటి విభేదాలున్నా ఆహ్వానించగానే కేటీఆర్ కూడా ఈ పోగ్రామ్‌కు వస్తానని చెప్పడంతో గతంలో పవన్‌పై కేటీఆర్ ‘ అది జనసేన కాదు మోడీ భజన సేన’ అంటూ చేసిన ఘాటు వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు పవన్ యాంటీ ఫ్యాన్స్. ఎప్పుడూ ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేసే పవన్ కల్యాణ్‌కి ఇంత బిల్డప్ అవసరమా అని మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై పలు వీడియోలు ట్రోల్ చేస్తూ, సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న `భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అదే స్థాయిలో హిందీలోనూ విడుదల చేయబోతుండడం విశేషం.