Pushpa Collections: కలెక్షన్స్ విషయంలో తగ్గేదే లే అంటున్న పుష్ప.. 50 రోజుల్లోఎంత వసూలు చేసిందో తెలుసా?

Pushpa Collections: ఇటీవల అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా థియేటర్ల వద్ద మంచి విజయాన్ని సాధించింది. బన్నీ నీ సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మూడవ సినిమా పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లో విడుదలై ప్రొడ్యూసర్లకు వసూళ్ల వర్షం కురిపించింది.2021 డిసెంబర్ 17 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. పుష్ప సినిమా విడుదల ఇప్పటికే రోజులు పూర్తయిన కలెక్షన్ విషయంలో ఏ మాత్రం తగ్గటం లేదు. ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ లో కూడా విడుదలై భారీ వసూళ్లను సొంతం చేసుకుంది.

పుష్ప సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 50 రోజులలో 365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద పుష్ప సినిమా కొత్త రికార్డులను సృష్టించింది.తాజాగా పుష్ప సినిమా కలెక్షన్స్ గురించి మైత్రి మూవీ మేకర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. మూవీ మేకర్స్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా”ఆల్ ఇండియా మాసివ్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప 50 రోజులలో 365కోట్ల భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోందని క్యాప్షన్ పెట్టింది.

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటికే రూ150 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. కరోనా సమయంలో చాలామంది హీరోలు తమ సినిమాలు విడుదల చేయటానికి భయపడి వాయిదా వేసుకున్నారు. కానీ పుష్ప సినిమా కరోనా సమయంలో కూడా భారీ మొత్తంలో వసూళ్లను మూట కట్టుకుంది.ఏదేమైనా పుష్ప సినిమాకి భారీ మొత్తంలో కలెక్షన్స్ రావడంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.