Health Tips:మోతాదుకు మించి నీరు తాగుతున్నారా? ఐతే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవు..!

Health Tips: శరీరానికి నీరు ఎంతో అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఆహారం, నీరు, సరిపడా నిద్ర చాలా ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యానికి చాలా ప్రమాదం. సాధారణంగా ఎండాకాలంలో డీహైడ్రేట్ అయ్యి అలసిపోతుంటారు. నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి శరీరాన్ని డీహైడ్రేషన్ సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. ఆకలి వేసిన, దాహం వేసిన మొదటిగా తీసుకునేది నీరు. అయితే ఏదైనా మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నీరు శరీరానికి ఎంతో ముఖ్యం, అయితే శరీరానికి సరిపడా నీరు తీసుకుంటే ఆరోగ్యం, అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు బారిన పడవలసి వస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

• కిడ్నీలు ఎంత చక్కగా పనిచేస్తే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటాడు. మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేవి కిడ్నీలు. ఇవి ఫిల్టరింగ్ వ్యవస్థ గా పనిచేస్తాయి. శరీరానికి అవసరమైన నీటిని తాగడం వల్ల కిడ్నీల పనితీరు బాగా ఉండి ఆరోగ్యవంతంగా ఉంటారు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల మీద ఒత్తిడి పెరుగుతుంది.
• శరీరానికి అవసరమైన నీటి కంటే ఎక్కువ తాగడం వల్ల వికారం కలుగుతుంది. శరీరంలో నీటి శాతం ఎక్కువ అయ్యి.. ఓవర్ హైడ్రేషన్ జరిగి.. వాంతులు, డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
• అధికంగా నీటిని తీసుకోవడం వల్ల, ఇది బ్రెయిన్ పనితీరు మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎక్కువ నీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ డైల్యూట్ జరుగుతుంది. శరీరంలో సోడియం లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. తద్వారా సెల్స్ వాచిపోయి కోమా, రెస్పిరేటరీ సమస్యలు వచ్చి ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
• ఎక్కువ నీరు తాగడం వల్ల బ్లడ్ వెజెల్స్ కుంచించుకు పోతాయి. ఫలితంగా సర్క్యులేటరీ సిస్టం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు మాత్రమే తాగండి. అధికంగా నీళ్లు తాగితే ఇటువంటి అనారోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంది.