DJ Tillu: ఈ మధ్య చిన్న సినిమాలకు అంతగా ఆదరణ లేకపోయింది. కానీ అలా చిన్న సినిమాగా విడుదలైన డీజే టిల్లు మాత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోందని చెప్పవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది. విడుదలకు ముందే పాటలకు మంచి టాక్ రాగా, ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, అమెరికాలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజే సూపర్ కలెక్షన్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
గుంటూర్ టాకీస్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్దు, ఆ తర్వాత కృష్ణ అండ్ హిస్ లీల సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు డీజే టిల్లుతో ఇంతకుముందున్న స్టార్‌డమ్‌ని దాటుకొని ఈ సినిమాతో తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఇంత క్రేజ్‌ను సంపాందించుకోవడానికి కారణం త్రివిక్రమే అని సినీ వర్గాల సమాచారం. ఆయన రిలీజ్‌కు ముందే ఈ మూవీని చూసి, కొన్ని సీన్లు కట్ చేయమని చెప్పడంతోనే ఇంతటి సక్సెస్‌కి రీజన్ అని టాక్. ఒకవేళ అది కట్ చేయకపోతే 28నిమిషాల నిడివి గల ఆ సీన్లు అలాగే ఉంటే ఈ రోజు టాక్ వేరేలా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఆ సీన్లను తగ్గించి కోర్టు రూమ్ డ్రామ్‌ను యాడ్ చేయడం, దానికి తోడు ఫన్‌తో సినిమాకు శుభం కార్డు పలకడం కలిసి వచ్చిందని అంతా మాట్లాడుకుంటున్నారు. జాతిరత్నాలు స్ఫూర్తితో చేసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మూవీకి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక కలెక్షన్ల విషయానికొస్తే ఇప్పటికే అనుకున్న దానికంటే వేరే లెవల్లో రికార్డులు బ్రేక్ కావడం చూస్తూనే ఉన్నాం. ఇక రానున్న రోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఉన్న సినిమాగా మారే అవకాశం డీజే టిల్లుకు ఉన్నాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.