DJ Tillu And Shyam Singha Roy : ఇప్పుడు మన టాలీవుడ్ సినిమా దగ్గర ఎలాంటి సినిమాలు వచ్చి అలరిస్తున్నాయి చూస్తున్నాము. ముఖ్యంగా వీటిలో చిన్న బడ్జెట్ మరియు చిన్న హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయ్యి లాభాలు ఇస్తూ వస్తున్నాయి.
అలా ఈ ఏడాది మొదట్లో అలాగే గత ఏడాది చివరలో వచ్చిన చిత్రాలు రెండు బాక్సాఫీస్ దగ్గ్గర అదరగోట్టాయి.
ఆ సినిమాలే నాచురల్ స్టార్ నాని నటించిన ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ చిత్రం “శ్యామ్ సింగ రాయ్” కాగా మరొకటి యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన “డీజే టిల్లు”. ఈ రెండు సినిమాలు కూడా థియేటర్స్ లో సాలిడ్ హిట్ అయ్యాయి.
అయితే ఈ రెండు హిట్ సినిమాలు కూడా గత కొన్ని రోజులు కితమే బుల్లితెరపై ఒకే సమయంలో టెలికాస్ట్ కి రాగా..
రెండు సినిమాలకి కూడా మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చినట్టుగా సినీ వర్గాల్లో సమాచారం బయటకి వచ్చింది. మొదటగా డీజే టిల్లు సినిమాకి చూసినట్టు అయితే 10.83 సాలీడ్ టీఆర్పీ రేటింగ్ నమోదు చెయ్యగా నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాకి గాను 6.87 రేటింగ్ వచ్చింది.
దీనితో ఈ రెండు సినిమాలకి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఈ రికార్డ్స్ నమోదు అయ్యాయి. ఇక డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి నటించగా నాని సినిమాలో సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే విమల్ కృష్ణ మరియు రాహుల్ సాంకృత్యాన్ లు దర్శకత్వం వహించారు.
