పెళ్ళికి ముందు లివ్-ఇన్ రిలేషన్ మీద దీపికా పదుకునే కామెంట్స్ !

Deepika Padukone says live-in relationship is not a tradition before marriage

బాలీవుడ్ లో ప్రేమ వ్యవహారాలు ఎక్కువగా ఉంటాయి, ఆ రేంజ్ లోనే బ్రేకప్స్ కూడా ఉంటాయి. ఈ సంవత్సరం జంటగా తిరిగిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వేరొకరితో జత కడతారు. బి-టౌన్ లో ప్రేమలు పెళ్లి వరకు వెళ్లటమనేది చాలా అరుదుగా జరుగుతుంటాయి. దీపికా పదుకునే, రణవీర్ సింగ్ జంట ఆరు సంవత్సరాల ప్రేమ తర్వాత 2018 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. బి-టౌన్ లో అత్యంత ఆదర్శ జంటలలో ఒకరిగా దీపికా, రణవీర్ ని ఒకరిగా పేర్కొంటారు.ఒక పత్రికా ఇంటర్వ్యూలో, దీపికాని రణ్‌వీర్‌తో లివ్-ఇన్ సంబంధాన్ని ఎందుకు ఎంచుకోలేదని అడగగా… ఈ రోజుల్లో చాలామంది జీవితకాల భాగస్వామిని నిర్ణయించటానికి ముందు తమ భాగస్వాములతో కలిసి జీవించడాన్ని ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Deepika Padukone says live-in relationship is not a tradition before marriage
Deepika Padukone says live-in relationship is not a tradition before marriage

వివాహానికి సంబంధించినంతవరకు సాంప్రదాయ మార్గాన్ని అనుసరించాలని తాను కోరుకున్నానని, అదే ఉత్తమ నిర్ణయంగా భావించామని దీపికా వెల్లడించారు.పెళ్ళికి ముందే కలిసి జీవిస్తే పెళ్లి తరవాత కొత్తగా చేయటానికి, తెలుసుకోవటానికి ఏం ఉంటాయని ప్రశ్నించారు. వివాహం గురించి ప్రజలు విరక్తి కలిగి ఉన్నారని నాకు తెలుసు , కానీ అది మా అనుభవం కాదు. మేము ఆచారాన్ని నమ్ముతున్నాము దానిలోని ప్రతి అంశాన్ని మేము ఆనందిస్తున్నాము ” అని ఇంటర్వ్యూలో దీపిక అన్నారు. దీపికా చేసిన ఈ కామెంట్స్ మీద భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.