Nagarjuna: పంచే కట్టిన ప్రతిసారి నాన్న గుర్తొస్తారు.. ఆ సినిమాలో వేరే వాళ్ళు వర్కౌట్ కారు.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్!

Nagarjuna: నాగార్జున నాగచైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తూ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బంగార్రాజు.ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ నాగార్జునను ప్రశ్నిస్తూ బంగార్రాజు సినిమాలో మీతో పాటు నాగచైతన్య నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో మీకు మీ నాన్నగారు గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నాగార్జున తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కేవలం ఈ సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే కాదు నేను ఎప్పుడు పంచె కట్టిన నాన్నగారు గుర్తొస్తారు అంటూ నాగార్జున ఎమోషనల్ అయ్యారు.ఇక బ్లడ్ రిలేషన్స్ గురించి మాట్లాడితే మనం సినిమా షూటింగ్ చేసేటప్పుడు నేను, నాన్న, నాగచైతన్య మా ముగ్గురిలో ఏ ఒక్కరు ఈ సినిమాల్లో నటించకపోయినా ఈ సినిమా వర్కౌట్ అయ్యేది కాదు. అని మనం సినిమా గురించి మాట్లాడారు.

ఇక బంగార్రాజు సినిమాలో నాగచైతన్యను తీసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి అనే విషయాన్ని కూడా నాగార్జున తెలిపారు. సోగ్గాడే చిన్నినాయన చిత్రం ఎంతో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఆ సినిమా వల్ల యూత్ కి ఎంటర్టైన్మెంట్ తక్కువగా అనిపించింది. అందుకే ఈ సినిమాలో చైతన్యను చిన్న బంగార్రాజు పాత్రలో నటింప చేశామని ఈ సందర్భంగా నాగార్జున తెలియజేశారు.