CM Jagan For Acharya : బిగ్ న్యూస్ : “ఆచార్య” కోసం వై ఎస్ జగన్? దీనిపై అసలు క్లారిటీ మీకోసం.!

CM Jagan For Acharya : ప్రస్తుతం టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రాం చరణ్ లు నటించిన “ఆచార్య” అనే చెప్పాలి.
దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఒకో అప్డేట్ రిలీజ్ చేస్తుండగా..
వాటితో పాటుగా ఓ షాకింగ్ బజ్ ఈ సినిమాపై నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం గాను ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రీ రిలీజ్ వేడుకకి హాజరు అవుతున్నారని టాక్ వచ్చింది.
దీనితో ఒక్కసారిగా ఈ టాక్ పెద్ద ఎత్తున సంచంలనంగా మారింది.
అయితే కొన్ని విశ్వస నీయ వర్గాల నుంచి మాత్రం మరో టాక్ వినిపిస్తుంది. అసలు ఇప్పుడు వైరల్ అవుతున్న మాటలో ఎలాంటి నిజం లేదని అది పూర్తిగా అవాస్తవం అని అంటున్నారు. దీనితో మెగాస్టార్ సినిమా కోసం వై ఎస్ జగన్ వస్తున్నారు అనేది అయితే ప్రస్తుతానికి నిజం కాదనే ఫిక్స్ అయ్యింది.
మరి ఆ ముఖ్య అతిధి ఎవరో వేచి చూడాలి. ఇంకా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్ లుగా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు భారీ బడ్జెట్ తో సినిమా నిర్మాణం వహించారని తెలిసిందే.