టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, సి. కళ్యాణ్, రాజమౌళి, దిల్ రాజు తదితరులు మంగళవారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్దికి సంబంధించిన అన్నిఅంశాల గురించి చర్చించడం జరిగింది. అయితే ఈ భేటీకి టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణను కూడా ఆహ్వానించారు. కానీ ఆయన బుధవారం పుట్టిన రోజు సందర్భంగా వీలు పడదని చెప్పారు. దీంతో ఉన్న టీమ్ తోనే చిరంజీవి సారథ్యంలో భేటీ జరిగింది. అయితే ఈ భేటీలో బాలయ్య ఊసెత్తారా? లేదా? అన్నది ఆసక్తికరం. ఎందుకంటే బాలయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయినప్పుడు భూములు పంచుకోవడానికేమో! అని వ్యాఖ్యానించడం రెండు రాష్ర్టాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఏపీ రాజకీయ వర్గాల్లోనూ బాలయ్య వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. బాలయ్య తీరుపై సాక్ష్యాత్తు ఆ పార్టీ నేతలే అసంతృప్తిని వ్యక్తం చేసారు. బాలయ్య మాట విధానం మార్చుకోవాలంటూ హెచ్చరించే ప్రయత్నం చేసారు. మరి ఇలాంటి పరిస్థితుల నడుమ జగన్ భేటీలో బాలయ్య గురించి అసలు ప్రస్తావన వచ్చిందా? లేదా? అన్నది నందమూరి అభిమానుల్లో ఇప్పుడు చర్చకొస్తుంది. బాలయ్యకు జగన్ పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే. కాబట్టి జగన్ అయినా బాలయ్య గురించి మాట్లాడే ప్రయత్నం చేసారా? లేదా? అన్నది ఫ్యాన్స్ లో ఆస్తక్తికరంగా మారింది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం భేటీ అనంతరం రెండు రోజుల తర్వాత కేసీఆర్ బాలయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవం, అభిమానంతోనే కేసీఆర్ ఈ పని చేసారని సోషల్ మీడియా కథనాలు వేడెక్కించాయి. మరి జగన్ కూడా అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తారా? అన్నది చూడాలి. ఎందుకంటే జగన్ ఎంతైనా బాలయ్యకు వ్యక్తిగతంగా పెద్ద అభిమాని. ఇప్పటికే ఈ భేటీకి సంబంధించి ఏఏ అంశాలపై చర్చించారన్నది మెగాస్టార్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.