బాడీ పై నేమ్ టాటూను చూపించిన అషురెడ్డి.. వారిద్దరి లవ్ ట్రాక్ నిజమేనా..?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషురెడ్డి కూడా ఒకరు. సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న అషురెడ్డి తనకున్న క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అషురెడ్డి క్రేజ్ మరింత పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ తో ఆమెకు మరింత పాపులారిటీ దక్కింది.

సోషల్ మీడియాలో పలు వెబ్ సిరీస్ లలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది అషురెడ్డి. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇకపోతే అషురెడ్డి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు అందాల కనువిందు చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ డ్రెస్సింగ్ విషయంలో ట్రోల్స్ కి కూడా గురి అవుతూ ఉంటుంది. ఇకపోతే అషురెడ్డి ఈ మధ్యకాలంలో మరింత స్పీడ్ పెంచేసింది. నిత్యం ఏదో రకమైన పోస్టులు చేస్తూనే ఉంది.

అషురెడ్డి కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. ఇక బుల్లితెర కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి అషురెడ్డి పేరుని పచ్చబొట్టు పొడిపించుకుని విషయం తెలిసిందే. ఆ మధ్య ఒక సారి షోలో తన పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్న విషయం బయట పెట్టడంతో వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే. కాగా అదే విషయాన్ని అషురెడ్డి మరొకసారి చెబుతూ హరి ఛాతి పై ఉన్న టాటూకి సంబంధించిన ఫోటోని ఇంస్టాగ్రామ్ ఖాతాలు షేర్ చేసింది. ఆ ఫోటోని షేర్ చేస్తూ అభిమానం అంటే ఇదే అన్న క్యాప్షన్ ని జోడించింది. దీంతో వారిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉంది అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.