Ashu Reddy: కొండల్లో గుట్టల్లో అవి చూపిస్తూ ఫోటోలు పెట్టిన అషు రెడ్డి.. ఫోటోలు వైరల్!

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు,ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలను చేస్తూ ఏకంగా జూనియర్ సమంతగా మంచి గుర్తింపు సంపాదించుకుని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఈ ఫాలోయింగ్ తో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది ఒక వారమే అయినా సింగర్ రాహుల్ తో కలిసి చేసిన రొమాన్స్ తో ఎంతో పాపులారిటీ పెరిగింది.

ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆశు రెడ్డి తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడమే కాకుండా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తుంది. గత కొద్ది రోజుల క్రితం దుబాయ్ వెళ్లి లక్షల్లో ఖర్చు చేసి హ్యాండ్ బ్యాగ్ లు కొనుగోలు చేయడం తన తల్లి వాటిని కాల్చి పడేయడం ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అంటూ ఫ్రాంక్ వీడియో చేస్తూ తన తల్లి చేతిలో తన్నులు తిన్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి.

ఇదిలా ఉండగా అషు రెడ్డి ఒక క్షణం ఇంటి దగ్గర ఉండకుండా పలు వెకేషన్స్ కి వెళ్తూ అక్కడ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంటాయి.తాజాగా అలాంటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోలో పొట్టి నిక్కరు ధరించిన అషు రెడ్డి తన తొడలను చూపిస్తూ కొండల్లో గుట్టల్లో ఫోటోలు దిగింది. ఈ క్రమంలోనే ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.