Pawan Kalyan: గ్రామం మొత్తానికి చెప్పులు కొన్న పవన్ కళ్యాణ్… సంతోషంలో గిరిజన గ్రామస్తులు!

Pawan Kalyan: సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల గిరిజన గ్రామాలలో పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే. వారం రోజుల క్రితం రెండు రోజులపాటు మన్యం జిల్లాలలో పర్యటన చేశారు. గిరిజన గ్రామాలలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడ గ్రామస్తులు ఎవరు కూడా కాలికి చెప్పులు వేసుకోలేదు.

ఇలా గ్రామంలో ఏ ఒక్కరు కూడా చెప్పులు వేసుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కాలి సైజులను సర్వే చేయించి ఈయన ప్రతి ఒక్కరికి చెప్పులను పంపించారు. ఇలా పెదపాడులో స్వయంగా 345 మందికి చెప్పులను పంపించారు దీంతో అక్కడున్న వారందరూ ఎంతో షాక్ అవ్వడమే కాకుండా మాకు పవన్ కళ్యాణ్ చెప్పులు పంపించారు అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆ చెప్పులను ధరించారు. ఈ నేపథ్యంలోనే తమకు చెప్పులు పంపినందుకు ఆ గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం కాస్త రాజకీయారంగు పులుముకుంది. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలలో పర్యటన చేస్తే గిరిజన సమస్యలను తెలుసుకుంటూ ఈయన ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గిరిజన గ్రామాలకు రోడ్లు సదుపాయం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని గిరిజన గ్రామాలకు రహదారులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.