Megastar Chiranjeevi: మెగాస్టార్ కి జోడిగా అనుష్క .. ఏ సినిమా అంటే?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ప్రస్తుత హీరోలకు పోటీ పడి మరీ సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా మరో మూడు సినిమాలు షూటింగ్ పనులను చెప్పుకుంటున్నాయి.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఒక సమాచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీర్రాజు, వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నయనతార తమన్నా శృతిహాసన్ వంటి కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి తోజోడి కట్టగా తాజాగా మెగాస్టార్ తన తరువాత చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటించడం కోసం అనుష్క శెట్టిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించడంతో చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన అనుష్క అయితే బాగుంటుందని డైరెక్టర్ భావించినట్లు తెలుస్తోంది. ఇక అనుష్క కూడా బాహుబలి సినిమా తర్వాత ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ లో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క మెగాస్టార్ సినిమా కి ఓకే చెబుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే అనుష్క ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చిరుతో కలిసి ఆడిపాడిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ సినిమాకు ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుందో తెలియాల్సి ఉంది.