బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మీ కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై పలు సినిమాలలో నటిస్తూ నటిగా గుర్తింపు పొందారు. అయితే ఈమె కేవలం తన వృత్తిపరమైన జీవితం వరకు మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాల గురించి, ముఖ్యంగా మూగజీవాల పట్ల ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దఎత్తున డిమాండ్ చేస్తారు.
ఈ క్రమంలోనే మూగజీవాల పై ఎంతో ప్రేమని చూపిస్తూ వాటికి ఎలాంటి కష్టం వచ్చినా రష్మీ స్పందిస్తూ వాటికి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఓ కుక్క ప్లాస్టిక్ క్యాన్ లో తలదూర్చి ఎంతో సతమతమవుతోంది. అయితే సమాచారం రెస్క్యూ టీమ్ కి చేరడంతో వాళ్లు వచ్చి ఆ ప్లాస్టిక్ క్యాన్ తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.అయితే అదే సమయంలో ఒక అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు వినండి అంటూ ఈమె చెప్పుకొచ్చారు.
ఈ విధంగా రెస్క్యూ టీం కుక్కను కాపాడే ప్రయత్నం చేస్తుండగా ఒక అంకుల్ మాత్రం అపార్ట్మెంట్ పరిసరాలలో ఇలాంటి పనులు చేయద్దు అంటూ చెబుతున్నారు.ఒక కుక్క పట్ల కనీస జాలి కూడా లేకుండా ఆ వ్యక్తి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈమె ఈ వీడియోని షేర్ చేశారు. మూగజీవాలకు ఇలాంటి పరిస్థితులు తలెత్తే కేవలం రెస్క్యూ టీం కి సమాచారం అందించండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు.. ఇలా అంకుల్ మాదిరి మాత్రం మాట్లాడకండి అంటూ రష్మి ఈ సందర్భంగా తెలియజేశారు.