మాస్టర్ ఛెఫ్‌లో మెరిసిన అనసూయ.. ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా.?

మిల్కీ బ్యూటీ తమన్నా హోస్ట్‌గా బుల్లితెరపై ‘మాస్టర్ ఛెఫ్‌’ అనే వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ని ప్రమోట్ చేసేందుకు తమన్నా చాలా కసరత్తులే చేసింది. కానీ, ఆశించి స్థాయిలో ప్రోగ్రామ్‌కి రెస్పాన్స్ రాలేదు. కారణాలు తెలీదు కానీ, తమన్నా ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పుకుంది.

ఆ ప్లేస్‌లోకి బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ వచ్చి చేరింది. హీరోయిన్‌గా తమన్నాకి స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఈ తరహా ప్రోగ్రాముల్ని రక్తి కట్టించడంలో అనసూయది అందె వేసిన చేయి. సో, అనసూయ హోస్ట్‌గా ఈ ప్రోగ్రామ్ క్లిక్ అవుతుందని ఆశతో మేకర్స్ అనసూయను ఎంపిక చేసుకున్నారట. తమన్నాని మ్యాచ్ చేసేలా సరికొత్త కాస్ట్యూమ్‌లో అనసూయ మెరిసిపోతోంది ఈ ప్రోగ్రామ్ కోసం.

ఇకపోతే, మరోవైపు జబర్దస్థ్ తప్ప ఇలాంటి ప్రోగ్రాములు చాలానే చేసింది అనసూయ కూడా. కానీ, అవేమీ జబర్దస్థ్ ఇచ్చినంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి ఆ లెక్కల్లో చూసుకుంటే, ఈ ప్రోగ్రామ్ అంతగా వర్కవుట్ అయ్యేది కాదంటూ సోషల్ కోడి కూత పెడుతోంది. ఇంత నెగిటివిటీ ఉన్న ఈ వంటల ప్రోగ్రామ్ సక్సెస్ అవడం సాధ్యమేనా.? చూడాలిక.