shriya saran: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో కనిపించని నటి శ్రియ.. కావాలనే పక్కన పెట్టారా అంటూ కామెంట్స్!

shriya saran: రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో తెరకెక్కింది. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా ఈ సినిమాలో కనిపించనున్నారు. అదేవిధంగా నటి శ్రియ, అజయ్ దేవగన్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని జనవరి 7వ తేదీ ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటి నుంచి పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇదివరకే చిత్రబృందం చెన్నై బెంగళూరు హైదరాబాద్ ముంబై వంటి నగరాలలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, హీరోయిన్ అలియా భట్, అజయ్ దేవగన్, నిర్మాత డివివి దానయ్య పాల్గొన్నారు. ఇలా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వీరందరూ పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటి శ్రేయ ప్రమోషన్ కార్యక్రమాల్లో కనిపించలేదు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ప్రమోషన్ కార్యక్రమాలలో కనిపించకుండా ఉండటానికి కారణం ఏమిటి ఆమె పాత్ర ఎంతో కీలకమైన కేవలం కొన్ని నిమిషాల పాటు ఉండటంతో ఆమెను కావాలనే ప్రమోషన్స్ కి దూరం పెట్టారా? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రియ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండడానికి గల కారణం ఏమిటో తెలియక పోయినప్పటికీ ఇంకా ఈ సినిమా విడుదలకు చాలా టైం ఉంది కనుక చివరి వారంలో శ్రీయ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది అంటూ మరికొందరు భావిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో శ్రీయ ఉంటుందా లేదా అనే విషయం మరి కొద్ది రోజులలో తెలియనుంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పోస్టర్లు టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెంచాయి.