‘ఆచార్య’నా లేక ‘పుష్ప’నా తెలిపోయేది రేపే.?

పండుగ సీజన్ వచ్చింది అంటే సినిమా పండుగ తోడై ఆ పండుగ మరింత హైలైట్ అవుతుందన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా అయితే మన టాలీవుడ్ లో ఈ పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. అలా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ సినిమా “పుష్ప” మొదటి భాగం ఆల్రెడీ డిసెంబర్ 17న ఫిక్స్ కాగా సరిగ్గా ఇదే డేట్ కు మెగా కుటుంబం నుంచి మెగాస్టార్ సినిమా “ఆచార్య” నే రంగంలో దిగుతుంది అని గట్టి టాక్ సినీ వర్గాల్లో నడుస్తుంది.

అయితే సరిగ్గా ఇదే డేట్ కి ఆచార్యా లేక పుష్ప అంటే దానికి సమాధానం రేపు దొరకనున్నట్టు తెలుస్తుంది. ఆచార్య రిలీజ్ డేట్ ని మేకర్స్ రేపు ప్రకటించనున్నారా అనే ఊహాగానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనితో సరిగ్గా అదే డేట్ కి ఈ భారీ యుద్ధం ఉంటుందా లేక మారుతుందా అనేది తెలియాల్సి ఉంది. మరి చిరు సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా పుష్ప సినిమాని క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ అందిస్తున్న సంగతి తెలిసిందే.