2021 నాటికి 25 కోట్ల మందికి క‌రోనా!

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లాక్ డౌన్న ఉన్నంత కాలం వైర‌స్ వ్యాప్తి అదుపులో ఉన్నా ఎత్తేసిన త‌ర్వాత ఎలాంటి ప‌రిస్థితులు ఎదర‌వుతున్నాయో చూస్తునే ఉన్నాం. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 11,981,313 మందికి మ‌హమ్మారి సోక‌గా, 547,324 మంది మృత్యువాత ప‌డ్డారు. మునుముందు కరోనా మ‌రింత‌గా మ‌ర‌ణ మృదంగా మ్రోగిస్తుంద‌ని స‌ర్వేలు హెచ్చ‌రిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు న‌మోదైన వాటికంటే 12 రెట్లు అధికంగా ఉంటాయ‌ని మ‌సాచు సెట్స్ ఇనిస్ట్యూట్ శాస్ర్త వేత్తలు అంచ‌నా వేస్తున్నారు. మ‌ర‌ణాల శాతం ఊహించ‌ని విధంగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

భార‌త్ లాంటి దేశాల్లో ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇంకా భార‌త్ లో స‌మూహ వ్యాప్తి లేక‌పోవ‌డం వ‌ల్లే కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని, ఒక్క‌సారి గ‌నుక స‌మూహ వ్యాప్తి మొద‌లైతే దాన్ని ఎవ‌రూ క‌ట్ట‌డి చేయ‌లేర‌ని, ప్ర‌భుత్వాలు కూడా ఇంకే చేయలేని నిస్స‌హయ స్థితిలో ఉంటాయ‌ని వెల్లడించారు. ఇప్ప‌టి నుంచే జాగ్ర‌త్త‌గా ఉంటేనే మ‌హమ్మారిని ఉన్న‌తంలో అరిక‌ట్ట‌గ‌ల‌మ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే భార‌త్ లో ప‌రిస్థితి కాస్త ఆందోళ‌న క‌రంగానే మారుతోంద‌ని వెల్ల‌డించారు. మ‌హమ్మారిని క‌ట్ట‌డి చేయ‌కుండా 2021 నాటికి 25 కోట్ల మంది వైర‌స్ బారిన ప‌డ‌తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

అలాగే 18 ల‌క్ష‌ల‌కు పైగా చ‌నిపోతార‌ని తెలిపారు. రోజుకు 2.8 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌న్నారు. అమెరికాలో రోజుకు 95000, ద‌క్షిణాప్రికాలో 21000, ఇరాన్ లో 17000 కేసులు న‌మోద‌య్యే ఛాన్స్ ఉంద‌ని అంచ‌నా వేసారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 84 దేశాల్లో ఉన్న 4.75 బిలియ‌న్ల జ‌నాభా స‌మాచారం ప‌రిశీలించి ఎంఐటీ ప్రోఫెస‌ర్లు ఈ గ‌ణాంకాల‌ను అంచ‌నా వేసారు.