Home Movie Reviews సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ రివ్యూ టాక్..!!

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ రివ్యూ టాక్..!!

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ రివ్యూ

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ మూవీ రివ్యూ .. కరోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న ప‌రిస్థితులు పూర్తిగా మారాయి. ఒక‌ప్పుడు వినోదం కోసం థియేట‌ర్స్ చుట్టూ తిరిగిన ప్రేక్ష‌కులు క‌రోనా వ‌ల‌న ఓటీటీల‌కు అల‌వాటు ప‌డిపోయారు. దీంతో థియేట‌ర్‌కు వెళ్లేవారి సంఖ్య త‌గ్గింది. నవంబ‌ర్ నుండి థియేట‌ర్స్ తెరచుకున్న‌ప్ప‌టికీ , కొత్త సినిమాలేవి లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు ఎవ‌రు థియేట‌ర్స్ కు వెళ్లేందుకు ఆస‌క్తి చూపలేదు. అయితే తొమ్మిది నెల‌ల త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సోలో బ్ర‌త‌కే సో బెట‌ర్ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లు క‌ళక‌ళ‌లాడుతున్నాయి.

Solo Brathuke So Better Movie Review And Rating
solo brathuke so better movie review And Rating

క‌రోనా జాగ్ర‌త్త‌ల న‌డుమ 50 శాతం కెపాసిటీతో థియేట‌ర్స్ లో సినిమా ప్ర‌ద‌ర్శితం అవుతుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కొన్ని చోట్ల ఇప్ప‌టికే బెనిఫిట్ షోలు ప‌డ్డాయి. మరోవైపు విదేశాల్లోనూ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సందడి చేస్తోంది. యూఎస్, దుబాయ్‌లో ఇప్పటికే తొలి షో పడిపోయింది. దీంతో నెటిజ‌న్స్ తమ ట్విట్ట‌ర్ ద్వారా ప్రీ రివ్యూ ఇచ్చేస్తున్నారు. సినిమా బాగుంద‌ని, చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చిన చిత్రం మంచి వినోదం అందించింద‌ని కామెంట్స్ పెడుతున్నారు. ఫ‌స్టాఫ్ కాస్త స్లోగా సాగిన స‌త్య‌, సాయితేజ్ మ‌ధ్య‌వ‌చ్చే కామెడీ స‌న్నివేశాలు హైలైట్ అంటున్నారు. ఇక రావు ర‌మేష్ ఎమోష‌న‌ల్ సీన్స్ లో ఇర‌గ‌దీయ‌గా, వెన్నెల కిషోర్ కూడా త‌న పాత్ర‌కి న్యాయం చేశాడ‌ట‌.

ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నభా నటేష్ ఎంట్రీ ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కించింద‌ని అంటున్నారు. విదేశాల నుండి వ‌చ్చిన న‌భా నటేష్‌.. సోలోగా ఉన్న సాయితేజ్‌తో క‌లిసి చేసిన సంద‌డి ఫుల్ ఎంట‌ర్‌టైన్ అందిస్తుంద‌ని అంటున్నారు. పెళ్ళి వ‌ద్దు వ‌ద్దు అన్న సాయితేజ్ చివ‌ర‌కి ఓ ఇంటివాడు కావ‌డంతో సినిమాకి ఎండ్ కార్డ్ ప‌డింది. 9 నెల‌ల త‌ర్వాత థియేట‌ర్‌లోకి వ‌చ్చిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రం ప్రేక్ష‌కులకు మంచి వినోదం అందించ‌డ‌మే కాకుండా డీసెంట్ హిట్ కొట్టింద‌ని నెటిజ‌న్స్ అంటున్నారు. సినిమాపై కాన్ఫిడెన్స్ ఉండ‌డంతోనే చిత్ర బృందం క‌రోనా న‌డుస్తున్న స‌మ‌యంలోను త‌మ సినిమాని ఇంత ధైర్యంగా రిలీజ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. క‌రోనా కాలంలో థియేట‌ర్‌లో విడుద‌ల అవుతున్న తొలి సినిమా ఇదే కాగా, దీనికి ఇండ‌స్ట్రీకి చెందిన ప్ర‌ముఖులు అంద‌రు చాలా స‌పోర్ట్ చేశారు. త‌ప్ప‌క మూవీని క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ థియేట‌ర్‌లో చూడాల‌ని కోరారు. ఏదేమైన సోలోగా వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ స్ట‌న్నింగ్ హిట్ కొట్టాడ‌ట‌.

Related Posts

ఒక జేబులో డబ్బు, ఇంకో జేబులో మందు..ఇది అల్లరి నరేష్ కథ

అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీకి కేరాఫ్ అడ్రెస్ అనేలా ఉండేవి. వరుసపెట్టి కామెడీ ఎంటర్టైనర్లు చేస్తూ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన నరేష్ అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు కూడ చేసేవాడు.  'నేను, గమ్యం,...

రివ్యూ : ఏక్ మినీ కథ

చిత్రం: ఏక్ మినీ కథ నటీనటులు: సంతోష్ శోభన్, కావ్యా థాపర్, బ్రహ్మాజి కథ-మాటలు: మేర్లపాక గాంధీ దర్శకత్వం: కార్తిక్ రాపోలు నిర్మాత: యూవీ క్రియేషన్స్ ఒక కుర్రాడి ప్రైవేట్ పార్ట్ సమస్య మీద తీసినా సినిమానే ఈ 'ఏక్...

రివ్యూ : సినిమా బండి – అమాయకులు సినిమా తీస్తే..

  తెలుగులో ఈమధ్య చిన్న సినిమాల సందడి ఎక్కువైంది.  స్టార్లతో పని లేకుండా కథను మాత్రమే నమ్ముకుని వస్తున్న ఈ చిన్న సినిమాల్లో కొన్ని మ్యాజిక్ చేస్తున్నాయి.  అలా వచ్చిన సినిమానే 'సినిమా బండి'. ...

Related Posts

Latest News