లీక్ షాక్ : పవన్ మల్టీస్టారర్ నుంచి ఇంట్రెస్టింగ్ వాంటెడ్ లీక్స్!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలు మరియు రాజకీయాల్లో బ్యాలన్స్ గా రన్ చేస్తూ వెళ్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల్లో అయితే ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రం కూడా ఒకటి. దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమా పవన్ తో పాటుగా మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచే కొన్ని లీక్ లు బయటకి రాగా అవి వైరల్ అయ్యాయి. అయితే ఈసారి మరో ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ లీక్స్ అయితే బయటకొచ్చాయి. ఈసారి ఏకంగా సినిమాలో సీన్ కి సంబంధించి వచ్చింది. అయితే ఈ లీక్స్ విషయంలో చిత్ర యూనిట్ హస్తమే ఉంది అని కొందరు అంటున్నారు.

ఈ సినిమాపై హైప్ ఎక్కించడం కోసమే తాము ఈ పని చేస్తున్నారని వేరే ఎవరూ కూడా కాదని అంటున్నారు. అయితే వారి ప్లాన్ కూడా బాగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో పవన్ లుక్ ఊహించని లెవెల్లో ఉంది. కాగా ఈ పిక్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో మరియు ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

మరి ఈ ప్లాన్ అయితే ఇంకా ముందు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు సహా స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది లోనే దసరా కానుకగా రిలీజ్ కానుంది.