యానిమల్‌’కు రెండు ఇంటర్వెల్స్!?

‘యానిమల్‌’ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా.. అని యావత్‌ ఇండియా మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది టీజర్‌, పాటలతోనే ఈ సినిమాపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ క్రియేట్‌ చేశాడు సందీప్‌ రెడ్డి వంగా. ఇంకా ట్రైలర్‌ కూడా విడుదల కాలేదు.. అప్పుడే బిజినెస్‌ లెక్కలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. సౌత్‌, నార్త్‌ అన్ని ఏరియాల డిస్ట్రిబ్యూటర్‌లు హక్కుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారట. ‘కబీర్‌ సింగ్‌’ టైమ్‌లో అందరూ ఆ చిత్రాన్ని వైలెంట్‌ సినిమా అన్నారు. అసలు వైలెన్స్‌ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్‌ సినిమాలో చూపిస్తా అంటూ ఆ మధ్య సందీప్‌ రెడ్డి ఓ బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ప్రీ టీజర్‌తోనే ఆ స్టేట్‌మెంట్‌కు జస్టిఫికేషన్‌ ఇచ్చాడు. ఇక సినిమా విడుదల దగ్గరికొస్తున్న కొద్ది కొన్ని లీకులు సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నాయి.

తాజాగా ‘యానిమల్‌’ సినిమాకు సంబంధించిన రన్‌ టైమ్‌ సోషల్‌ మీడియాను ఊపేస్తుంది. ఈ సినిమా రన్‌టైమ్‌ అక్షరాల 3 గంటల 30 నిమిషాలట. ఈ మధ్య కాలంలో ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు. నిజానికి ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌తో ఆడియెన్స్‌ను థియేటర్‌లకు కట్టిపడేయం కత్తి మీద సామే. అయితే బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. సినిమా టెర్రిఫిక్‌గా ఉందని, ఒక్క నిమిషం కూడా బోర్‌ కొట్టుకుండా ఉంటుందని వినిపిస్తుంది. ఇంత లెంగ్తీ రన్‌టైమ్‌ అంటే మల్టిప్లెక్స్‌ థియేటర్‌లకు చుక్కెదురే అని చెప్పాలి.

ఎప్పటికంటే కాస్త త్వరగానే ఆటలు మొదలు పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెద్ద సినిమాలకు ఆరు షోల వరకు చాన్స్‌ ఉంటే.. ‘యానిమల్‌’ సినిమాకు మాత్రం ఐదు షోలు మాత్రమే వేసుకునే చాన్స్‌ ఉంటుంది. ఇక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో కూడా టైమింగ్స్‌ మారే చాన్స్‌ ఉంటుంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో రక్తపాతం ఊహించని రేంజ్‌లో ఉంటుందని.. మనం ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకుంటామో దానికి వంద రేట్లు ఎక్కువే ఉంటుందని సినిమాలో నటించిన వాళ్లు చెబుతున్నారు. బార్డర్‌లు పెట్టుకున్న టాలీవుడ్‌కే ‘అర్జున్‌ రెడ్డి’లాంటి అల్టిమేట్‌ సినిమానిచ్చినప్పుడు.. ఇప్పుడు అసలు బార్డర్‌లు లేని ‘యానిమల్‌’తో ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తాడో ఊహకు కూడా అందకుండా ఉంది.