‘సికిందర్‌’ ఆఫర్‌ అందుకున్న రష్మిక!

స్టార్‌ హీరోల సరసన అలరిస్తోన్న రష్మిక తాజాగా మరో క్రేజీ ఆఫర్‌ అందుకున్నారు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఆ విషయాన్ని ఖరారు చేస్తూ సోషల్‌ విూడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘విూరు ఎన్నో రోజులుగా నా సినిమా అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విూకోసమే ఈ సర్‌ప్రైజ్‌. ‘సికందర్‌’తో విూ ముందుకు వస్తున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా, గౌరవంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఇది ఆమె 25వ సినిమా కావడం విశేషం.

తమిళ దర్శకుడు ఎ.ఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రమే’సికందర్‌’. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మొదట కియారా అడ్వాణీ కథానాయికగా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. తాజాగా రష్మికను తీసుకున్నట్లు టీమ్‌ పోస్ట్‌ పెట్టింది. భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ చిత్రమిదని, సామాజిక అంశం కూడా ఉంటుందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మురుగదాస్‌ తెలిపారు.

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పుష్ప’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ధనుష్‌, నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న’కుబేర’లో నటిస్తున్నారు. ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి నాయికా ప్రాధాన్యమున్న సినిమాల్లో మెరవనున్నారు. వీటితో పాటు ‘పుష్ప ది రూల్‌’లో శ్రీవల్లిగా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.