అషు రెడ్డి ముఖానికి సర్జరీ చేయించుకుందన్నడానికి ఇదే ప్రూఫ్!

సోషల్ మీడియా పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిల్లో చాలా మంది భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా సినిమాలు, సీరియళ్లు, షోలలో అవకాశాలను అందుకుంటూ హవాను చూపిస్తున్నారు. ఇలా చాలా కాలం క్రితమే ఫేమస్ అయిన బ్యూటీ అషు రెడ్డి.

బుల్లితెర ప్రేక్షకులకు, నెటిజన్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె కొంత కాలంగా అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హల్‌చల్ చేస్తోంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అషూ తరచూ తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ తన అభిమానులకు కనువిందు చేస్తూ ఉంటుంది.

అప్పట్లో విపరీతంగా ట్రెండ్ అయిన టిక్‌టాక్‌, డబ్‌స్మాష్ వీడియోల ద్వారానే అషు రెడ్డి ఫేమస్ అయింది. స్టార్ హీరోయిన్ సమంత పోలికలతో ఉన్న ఆమెను అందరూ జూనియర్ సామ్ అనేవాళ్లు. జూనియర్‌ సమంతగా పేరు తెచ్చుకున్న ఆమె అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ సీజన్ 3 లో ఆఫర్‌ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ లక్షల్లో ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ‘ఛల్ మోహనరంగ’ అనే మూవీ ఛాన్స్ పట్టేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరోసారి తెగ సందడి చేసేసింది.

ఆ మధ్య అషు రెడ్డి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ‘కామెడీ స్టార్స్’ షోలో రచ్చ చేసింది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి టీమ్‌లో స్కిట్లు కూడా చేయడం జరిగింది. అదే సమయంలో ‘హ్యాపీ డేస్’ అనే షోతో యాంకర్‌గానూ మారింది. ఇందులో యాంకర్ రవితో కలిసి సందడి చేయడం జరిగింది. వీటితో పాటు అషు రెడ్డి కొన్ని స్పెషల్ ఈవెంట్లు, షోలలో కనిపిస్తూ రచ్చ కూడా చేసిన విషయం అందరికి తెలిసిందే.

దీంతో మరింత పాపులర్‌ అయిన అషూ రీసెంట్‌గా బిగ్‌బాస్‌ ఓటీటీలోను అడుగుపెట్టింది. ఫినాలేకు అతి దగ్గర్లో ఉండగా అనూహ్యాంగా హౌజ్‌ నుంచి బయటకు వచ్చింది అషూ. అప్పటి నుంచి హాట్‌హాట్‌ ఫొటోలకు ఫోజులు ఇస్తూ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. ఫ్యాషన్ ఐకాన్ లా అరకొర బట్టలు వేసుకొని కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఆమె డ్రెస్సింగ్ మీద చాలామంది చాలా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. దీని ఫలితంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

గతంలో ఈ బ్యూటీ ఓ ఫొటోషూట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో అషు రెడ్డి చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దీని ద్వారానే తన ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ పోస్టులు పెడుతోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంటోంది. వీటిపై మీమ్స్ క్రియేట్ చేసి మరీ కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు.

అయితే ఆమె తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని ఆడిపోసుకున్నారు. తన మేకప్ ఫేస్ కి అంత సీన్ లేదు అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే అషు గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యులో దీని గురించి అడిగినప్పుడు అదంతా అబద్దమని ఆమె ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు అని చెప్పడం జరిగింది. అవన్నీ ఆమె పట్టించుకోనని చెప్పినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోషూట్ లతో ఇంకా వేరే ఛానల్ షోలతో బిజీబిజీగా గడుపుతోంది అషూ రెడ్డి.