Ashu Reddy: వేణు స్వామితో కలిసి మరోసారి ప్రత్యేక పూజలు చేసిన అషూ రెడ్డి.. ఫోటోస్ వైరల్!

Ashu Reddy: తెలుగు ప్రేక్షకులకు అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అషూ రెడ్డి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షోలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మొదటి టిక్ టాక్ వీడియోలు, డబ్ స్మాష్ వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయిన ఈమె ప్రస్తుతం యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ మరోవైపు షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాగే బిగ్ బాస్ షో ద్వారా కూడా బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ రియాలిటీ షోతో సహా పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేసింది. కొన్ని సినిమాల్లోనూ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి మెప్పించింది.

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే యాంకర్ గా టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటోంది. అలాగే యూట్యూబ్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇకపోతే అప్పుడప్పుడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కూడా మునికి తేలుతూ ఉంటుంది అషూ రెడ్డి. ఇందులో భాగంగానే గతంలో చాలా ప్రముఖ దేవాలయాలను సందర్శించిన విషయం తెలిసిందే. అలాగే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామితో కలిసి కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేసింది. అయితే తాజాగా మరొకసారి ఈ వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించింది అషూ రెడ్డి.

తాజాగా అస్సాం లోని ప్రముఖ కామాఖ్య ఆలయాన్ని దర్శించకుందీ ఈ ముద్దుగుమ్మ. అక్కడ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించింది. అనంతరం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అషూ రెడ్డి ఒకవైపు బుల్లితెరపై ఇంటర్వ్యూలు చేస్తూనే, కొన్ని కామెడీ షోలలో కూడా చేస్తూ బిజీ ఉంది.