టాలీవుడ్ ఇండస్ట్రీలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే జోడీలలో మహేష్ బాబు నమ్రత జోడి ఒకటి. నమ్రత నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు.ఈ సినిమాతోనే మహేష్ బాబుతో పరిచయం ఏర్పడడం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మహేష్ బాబు గురించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు. మహేష్ తన పక్కన ఉంటే ఎన్ని రోజులైనా సమయం తెలియకుండా తనకు గడిచిపోతుందని తెలిపారు.
ఇకపోతే మొదటిసారి మహేష్ బాబును చూడగానే ఎలాంటి ఫీలింగ్ కలిగిందనే ప్రశ్న తనకు ఎదురవడంతో మహేష్ బాబుని చూడగానే ఏంటి ఇలా రిజర్వెడ్ గా ఉన్నారనిపించింది.ఎలాగైనా ఈయనను మార్చాలని అనుకున్నాను అంటూ నమ్రత వెల్లడించారు.ఇకపోతే మహేష్ బాబుకి సినిమాలలో ఏవైనా సజెస్ట్ చేస్తారా అంటే అలాంటిది ఏమి తాను చేయనని ఈమె వెల్లడించారు.ఇకపోతే మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు ఇష్టమైన సినిమాలు ఏంటి అని ప్రశ్నించగా మహేష్ నటించిన సినిమాల గురించి నమ్రత తెలిపారు.
మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు పోకిరి సినిమా చాలా ఇష్టమని ఈ సినిమాతో పాటు ఒక్కడు, అతడు, మురారి సినిమా చాలా ఇష్టమని నమ్రత ఈ సందర్భంగా వెల్లడించారు. మురారి సినిమా క్లైమాక్స్ లో మహేష్ నటన ఎంతో అద్భుతంగా ఉందని, ఆ సినిమా తనకు ఎంతగానో నచ్చుతుందని ఈమె తెలిపారు.ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ బాబు సినిమాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని తానే నిర్ణయం తీసుకుంటారని ఆయన సినిమాల విషయంలో తాను ఏ విధమైనటువంటి జోక్యం చేసుకోనని తెలిపారు. ఒకవేళ తన స్టైలిష్ లేకపోతే అలా ఉండు ఇలా ఉండు అని కేవలం సజెస్ట్ మాత్రమే చేస్తానని ఈ సందర్భంగా నమ్రత తెలిపారు.