CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు మద్దతు పలికిన తెలుగు ఫిలిం ఎగ్జిబిటర్స్.. తలలు పట్టుకుంటున్న నిర్మాతలు!

CM Revanth Reddy: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకుని తాను సీఎంగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వను అని తెగేసి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి టాలీవుడ్ నిర్మాతలు తలలు పట్టుకున్నారు. పెద్ద హీరోల సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలో పరిస్థితి ఏంటి అన్న అయోమయంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు రేవంత్ రెడ్డి మాటలకు మద్దతు పలుకుతూ టాలీవుడ్ పెద్దల ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడారు.

తాజాగా ఒక ప్రెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు ఫిలిం ఛాంబర్ ఎగ్జీబిటర్స్ అసోసియేషన్. ఈ ప్రెస్ మీట్ లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బెనిఫిట్ షోస్, టికెట్ రేట్ల పై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సింగిల్ స్క్రీన్స్ కు ఊపిరి పోసేలా ఉన్నాయి. సీఎం గారికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కు కృతజ్ఞతలు అని అన్నారు. అనంతరం తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసాం అని అధిక రేట్లు పెడుతున్నారు. దీని వల్ల ప్రేక్షకులకు, థియేటర్స్ వారికి ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలో కూడా అమలు అవ్వాలి అని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ మాట్లాడుతూ..

ఆడియన్స్ కి టికెట్ రేటు ఎంత ఉందో కూడా తెలియక అయోమయంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాము. రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. దాంతో చిన్న సినిమాకు డబ్బులు ఉండడం లేదు ఆడియన్స్ దగ్గర. సగటు ప్రేక్షకుడు థియేటర్ దగ్గరకు రావాలి. అలాగే హీరోలు థియేటర్స్ కు వెళ్ళొద్దు అని మంత్రి అనడం సముచితం కాదని అన్నారు. ఈ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టాలీవుడ్ నిర్మాతలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. త్వరలో సంక్రాంతి పండుగ కానుకగా వరుసగా సినిమాలు విడుదల కానున్నాయి. అన్ని కూడా పెద్ద సినిమాలె. ఇలాంటి సమయంలో అలాంటి మాటలు మాట్లాడడంతో ఏం చేయాలో తోచక అయామయంలో పడ్డారు.