సూర్య – బోయపాటితో సినిమా ? వద్దు బాబోయ్ అంటున్న అతని ఫ్యాన్స్ ?

సూర్య రీసెంట్ గా ఆకాశం నీ హద్దురా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపినాథ్ అధినేత ఆటోబయోగ్రఫీ ఆధారంగా లేడీ డైనమిక్ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కించారు. అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించింది. నవంబర్ లో ఓటీటీ ద్వారా రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో సూర్య మంచి హిట్ అందుకొని ఫాంలోకి వచ్చాడు. కోలీవుడ్ లో సూరారై పోట్రు గా వచ్చి హిట్ సాధించడం తో సూర్య నెక్స్ట్ సినిమాలని చేసేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకుంటున్నాడు.

ఈ క్రమంలో తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పాండి రాజన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు సూర్య. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారు. ఇక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన దర్శకుడు పాండి రాజన్ – సూర్య కాంబినేషన్ లో సినిమా అనగానే కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో సూర్య కి జంటగా నటించే అవకాశం ఉందని మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

ఈ క్రమంలో సూర్య తో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక ప్రాజెక్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వాస్తవంగా ఈ ప్లాన్ దిల్ రాజు ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికి సూర్య తో ప్రాజెక్ట్ సెట్ అవడం లేదు. కాగా ఎట్టకేలకి సూర్య నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. అయితే సూర్య ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారట. అందుకు కారణం ఈ సినిమాకి దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు వినిపిస్తుండటమే అంటున్నారు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఈ కాంబినేషన్ ని వద్దని సలహా ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరి ఇది నిజమా కాదా అన్నది మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.