సూర్య సినిమా విడుదల వాయిదా…!

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య, సుధా కొంగరాల కాంబినేషన్‌లో రానున్న సినిమా వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. ‘పురాణనూరు’ చిత్రీకరణ అధిక సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ చిత్రం మాకెంతో ప్రత్యేకం. ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తాం అని పేర్కొంది.

”ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మీ కాంబినేషన్‌లో వచ్చిన ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం కూడా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు. ‘సూర్య43’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌, నజ్రియా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. జీవీ ప్రకాశ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. గతంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.

అందులో టైటిల్‌’పురాణనూరు’ పేరుతో ముగుస్తుంది. ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో ‘కంగువా’లో నటిస్తున్నారు. దిశా పఠానీ కథానాయిక. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.