గ్లింప్స్ టాక్ : “పుష్ప 2” నుంచి ఓ రేంజ్ లో హైప్ రేపిన వీడియో.!

సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “పుష్ప ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. పార్ట్ 1 బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఈ సినిమాపై హైప్ తారా స్థాయికి వెళ్ళింది. అయితే ఈ సినిమాని అస్సలు ఎలా సుకుమార్ తెరకెక్కిస్తున్నారు అనే అంశం అంతకంతకు సస్పెన్స్ గా మారగా. 

ఇప్పుడు ఈరోజు ఇస్తామన్న బిగ్ అప్డేట్ ని చిత్ర యూనిట్ ఇప్పుడు రివీల్ చేశారు. అయితే ఏదో నామ మాత్రంగా చిన్న అప్డేట్ ఏదన్నా డేట్ ని అనౌన్స్ చేస్తారు అనుకుంటే ఊహించని విధంగా ఓ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు. కాగా ఇందులో పుష్ప రాజ్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయినట్టుగా చూపిస్తున్నారు.

అంతే కాకుండా అతడికి గాయాలు కూడా ఉన్నాయని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ని రివీల్ చేసేసారు. ఇక ఇదంతా చూస్తుంటే పాన్ ఇండియా వైడ్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పాలి. అలాగే ఒకింత హైప్ గా ఉన్నా కేజీయఫ్ తరహాలో ప్రోగ్రెస్ ని కనబరుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.

మొత్తానికి అయితే ఓ బిగ్ ట్రీట్ ని మేకర్స్ ప్లాన్ చేసినట్టుగా క్లియర్ గా అర్ధం అవుతుంది. అయితే ఈ సినిమా నుంచి అనుకున్నట్టుగానే ఏప్రిల్ 7న బన్నీ బర్త్ డే ముందు రోజు అయితే సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి మిగతా వీడియో ని రిలీజ్ చేస్తున్నట్టుగా సెన్సేషనల్ క్లారిటీ ఇప్పుడు ఇచ్చారు.