లైజర్ దెబ్బకు ముంబై కాళీ చేసిన పూరి జగన్నాథ్?

పూరి జగన్నాథ్ ఎన్నో అంచనాల నడుమ లైగర్ సినిమాని విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా మొట్టమొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. ఇలా పూరి జగన్నాథ్ నిర్మాణంలో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీఎన్నో అంచనాల నడుమ విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సంపాదించుకొని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎక్కువ ధరలకు ఈ సినిమాని కొనుగోలు చేయడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుపుకుంది.అయితే ఈ సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో బయ్యర్లు పూర్తిగా నష్టపోయారు.ఇక అధిక ధరలకు సినిమాను కొనుగోలు చేసిన నష్టపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు పూరి జగన్నాథ్ పై భారీ ఒత్తిడి తీసుకువచ్చి తమ డబ్బు తమకు వెనక్కి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ విధంగా పూరి జగన్నాథ్ లైగర్ సినిమా వల్ల పూర్తిగా నష్టపోవడంతో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఇలా ఈ సినిమా వల్ల భారీ నష్టాలు రావడంతో ఈయన ముంబై కాళీ చేయాలని భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ ముంబైలో ఉన్నటువంటి ఫ్లాట్ అద్దె నెలకు 10 లక్షలు.అలాగే ఇతరతా ఖర్చులు కలిపి నెలకు 15 లక్షల వరకు ఖర్చు రావడంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ ఖర్చులను భరించలేనటువంటి పూరీ జగన్నాథ్ ముంబైలో తన ప్లాంట్ ఖాళీ చేసి తిరిగి హైదరాబాద్ రాబోతున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో ఈయన ముంబై కాళీ చేయాల్సి వచ్చింది. అదే కనుక సినిమా హిట్ అయి ఉంటే కథ మరోలా ఉండేదని పలువురు భావిస్తున్నారు.