మీరు మనిషేనా.. అంటూ బాలకృష్ణ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగ్యా జైస్వాల్!

అందం అభినయంతో ఎంతోమంది కుర్రకారును ఆకట్టుకున్న హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ కంచె, జయ జానకి నాయక వంటి చిత్రాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా పలు చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

Pragya Jaiswal 1 | Telugu Rajyamఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.. ఇందులో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ శ్రావణి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు పూర్తిగా వినకుండానే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సరసన నటించడానికి కాస్త భయపడినట్లు తెలిపారు.మొదట్లో తన పక్కన నటించడం కోసం ఎంతో కంగారు పడ్డానని కానీ బాలకృష్ణ గారిని కలిసిన ఐదు నిమిషాలకే అతనితో ఎంతో కంఫర్ట్ గా అనిపించిందని ఈమె వెల్లడించారు.

ఇక బాలకృష్ణ క్రమశిక్షణ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారని. ఎన్ని గంటలకు షూటింగ్ అంటే అంతకు ముందుగానే అక్కడికి చేరుకుంటారని తెలిపారు.ఈ సినిమా కోసం బాలకృష్ణ గారు మూడు గంటలకే నిద్రలేచి ఆరు గంటలకి సెట్ లో ఉండే వారిని అంతగా ఈ సినిమాకి కష్టపడ్డారని తెలిపారు.ఇలా బాలకృష్ణ ఎనర్జీ చూసి తనకు ఎంతో ఆశ్చర్యం వేసేదని ఈ క్రమంలోనే ఒకరోజు అసలు మీరు మనిషేనా? ఇలా ఎలా పని చేయగలుగుతున్నారు అంటూ తను బాలకృష్ణని అడిగానని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి తాను ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నానని తెలిపారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles