‘ఉస్తాద్‌’ పై పవన్‌ అభిమానుల ఎదురుచూపు!

పదేళ్ల కిందట వచ్చిన ’గబ్బర్‌ సింగ్‌’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. తన అభిమాన హీరోను తెరపై ఎలా చూపిస్తాడో అనే దానికి ఒక ఎగ్‌జాంపుల్‌ క్రియేట్‌ చేశాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ఇక ఇప్పుడు అదే కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతుందంటే పవన్‌ అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనే ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఏడాది కిందట ’భవదీయుడు భగత్‌ సింగ్‌’ అంటూ బైక్‌పై కళ్యాణ్‌ ఉన్న ఫోటోను రిలీజ్‌ చేసి వీళ్ల కాంబోలో రెండో సినిమా తెరకెక్కుతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటన వచ్చింది.

అయితే కొన్ని నెలల తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై ఉలుకూ, పలుకూ లేదు. అసలు ఈ ప్రాజెక్ట్‌ ఉందా? లేదా? అనే క్లారిటీ కూడా లేదు. దాంతో సోషల్‌ విూడియాలో ఆ ప్రాజెక్ట్‌ కాన్సిల్‌ అయిందని వార్తలు వచ్చాయి. కాగా గతేడాది చివరి నెలలో పేరు మార్చి మళ్లీ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసి వీళ్ల కాంబో కాన్సిల్‌ కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక పవన్‌కు వీలైనప్పుడల్లా షూటింగ్‌లో పాల్గొంటూ తన సీన్స్‌ను కంప్లీట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్‌ ఈ సినిమా షూటింగ్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ టెర్రిఫిక్‌ పర్ఫార్మెన్స్‌తో మేజర్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు ’ఎఊ’ అని ఉన్న క్యాప్‌ ఫోటోను పంచుకున్నారు. అదెందుకు పెట్టారో తెలియదు కానీ.. పలువరు నెటిజన్లు మాత్రం దాని అర్థం ఇండస్టీ హిట్‌ అని చెప్పడానికి సింబాలిక్‌గా క్యాప్‌ ఫోటోను పెట్టారని కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో గబ్బర్‌సింగ్‌ తరహాలోనే అటు మాస్‌ను ఇటు క్లాస్‌ను ఆకట్టుకునే పోలిస్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి స్వరాలు అందిస్తున్నాడు.