బింబిసార ఈవెంట్ లో తారక్ ధరించిన టీ షర్ట్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ బయట ఎక్కడా కనిపించలేదు. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యాడు. కల్యాణ్ రామ్ అతనొక్కడే, పటాస్ వంటి మంచి హిట్ సినిమాలలో నటించాడు. పటాస్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కళ్యాణ్ రామ్ నటుడిగా కాకుండా నిర్మాతగా కూడా మారాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ స్థాపించి సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా కూడా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మించారు.

కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. దీంతో ఇటీవల ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్ గా హాజరై ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ తన స్పీచ్ తో అదరగొట్టాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈవెంట్ లో ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ ధర హాట్ టాపిక్ గా మారింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ కలర్ ఫుల్ హాండ్స్ టీ షర్ట్ లో చాలా డీసెంట్ గా కనిపించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ధరించిన ఆ బ్లాక్ టీషర్టు అందరినీ ఆకర్షించింది. దీంతో ఆ టీషర్టు కోసం అభిమానులు నెట్టింట సెర్చింగ్ మొదలు పెట్టారు.

ఎన్టీఆర్ ధరించిన Karl Lagerfeld బ్రాండ్ టీషర్టు ఆన్లైన్ లో రూ.24 వేలు చూపిస్తోంది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ ధరించిన టీ షర్ట్ మరీ ఇంత కాస్ట్‌లీనా అంటూ నోరెళ్ళబెడుతున్నారు. అయితే ఇలాంటి కాస్ట్లీ వస్తువులు వాడటం ఎన్టీఆర్ కి కొత్త ఏమి కాదు. ఎన్టీఆర్ ఉపయోగించే వస్తువులు అన్నీ చాలా కాస్ట్లీ గానే ఉంటాయి. ఎన్టీఆర్ ఉపయోగించే వాచ్ ల ఖరీదు దాదాపు కోట్లలో ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఉపయోగించే కార్లు కూడా చాలా ఖరీదైనవి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టిఆర్ 30 సినిమాలో నటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.