దక్షిణాది సినిమా దగ్గర హీరోలని అభిమానులు ఏ లెవెల్లో ఆరాధిస్తారో అదే విధంగా చాలా తక్కువమంది హీరోయిన్స్ కి భారీ క్రేజ్ ఉంటుంది. మరి అలాంటి స్టార్ హీరోయిన్స్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.
అయితే నయనతార రీసెంట్ గానే తన వైవాహిక జీవితాన్ని స్టార్ట్ చేసింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నటువంటి దర్శకుడు విగ్నేష్ శివన్ తోనే పెళ్లి చేసుకొని ఈ దంపతులు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు. అయితే వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరగగా బయటకి ఆ విజువల్స్ పెద్దగా బయటకి రాకపోవడం ఆసక్తిగా మారింది.
కానీ దీని కారణం ఈ ఈవెంట్ హక్కులు స్ట్రీమ్ చేసేందుకు భారీ మొత్తంలో 25 కోట్లు చెల్లించి ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేశారు. కానీ తర్వాత వీరి ఒప్పందాన్ని మీరు కొన్ని ఫోటోలను నయన్ దంపతులు షేర్ చేసుకున్నారని డీల్ క్యాన్సిల్ చేసుకున్నారని అంతే కాకుండా ఇచ్చిన 25 కోట్లు కూడా వెనక్కి ఇమ్మన్నారని పలు గాసిప్స్ వినిపించాయి.
మరి దీనిపై అయితే ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. ఎందుకంటే తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా వారు నయన్ విగ్నేష్ ల కొన్ని ఫోటోలు షేర్ చేసి అన్ని రూమర్స్ కి బ్రేక్ ఇచ్చారు. దీనితో డీల్ క్యాన్సిల్ చేసుకోలేదని ఓకే బిగ్ క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి. అయితే ఇంకా ఏ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.
These images of Nayanthara and Vignesh have us seeing stars 🤩✨
BRB, we're doing a little happy dance ourselves because THEY’RE coming to Netflix🕺💃it’s beyond a fairy tale!! pic.twitter.com/14poQwNAZv
— Netflix India (@NetflixIndia) July 21, 2022