‘ది ప్యారడైజ్’ నుంచి అనిరుధ్ తప్పుకున్నాడా?

రాక్‌స్టార్ అనిరుధ్ తన సంగీతంతో పాన్ ఇండియా స్థాయిలో టాప్ లో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది ప్యారడైజ్’ కోసం అనిరుధ్ సంగీతం అందిస్తారని మొదట ప్రకటించినా, తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.

అనిరుధ్ ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ‘ది ప్యారడైజ్’కు తన సమయాన్ని కేటాయించలేకపోతున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే అనేక ప్రాజెక్టులపై పనిచేస్తున్న అనిరుధ్, నాని కోరిక మేరకు ఈ ప్రాజెక్ట్‌లో చేరినప్పటికీ, సమయాభావం వల్ల తన కమిట్‌మెంట్‌ను నిలబెట్టుకోలేకపోయాడని సమాచారం. ఇది చిత్ర బృందానికి నిరాశ కలిగించినప్పటికీ, ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు తగ్గడం లేదు.

అనిరుధ్ స్థానంలో కొత్త సంగీత దర్శకుడి ఎంపిక కోసం చిత్ర బృందం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ కీలకమైన పాత్ర పోషించనుండటంతో, అనిరుధ్ స్థాయికి తగ్గ మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలన్నది నిర్మాతల లక్ష్యం. అభిమానులు ఇప్పుడు ఈ చిత్రానికి కొత్త సంగీత దర్శకుడు ఎవరవుతారనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

‘ది ప్యారడైజ్’ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. మోహన్ బాబు, రమ్య కృష్ణ వంటి స్టార్ దిగ్గజాలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక ప్రిపరేషన్ చేస్తున్నారని సమాచారం. ‘హిట్ 3’ పూర్తైన వెంటనే ‘ది ప్యారడైజ్’ షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.