‘మిస్టర్‌ బచ్చన్‌’ క్రేజీ అప్‌డేట్‌

టాలీవుడ్‌ మాస్‌ మహరాజా రవితేజ, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ‘నామ్‌ తో సునా హోగా’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్‌ చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ తన ఫేవరేట్‌ లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ పోజ్‌లో కనిపిస్తూ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేస్తున్నాడు. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ వచ్చింది.

తాజాగా మూవీ కంప్లీట్‌ అయినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ఒక ప్రమోషనల్‌ వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో రవితేజ అభిమాని వచ్చి హరీశ్‌ శంకర్‌ను నేను రవితేజ డై హార్డ్‌ ఫ్యాన్‌ అన్న అంటాడు. ఆ తర్వాత మూవీ నుంచి ఎదైనా అప్‌డేట్‌ ఇవ్వమని కోరతాడు.

దీనికి హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ.. షూటింగ్‌ అయిపోయింది. ఇక అప్‌డేట్‌లే మిగిలి ఉన్నాయి. గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌లు అవి అందరూ ఇచ్చేవే మనం ఈసారి కొత్తగా ప్లాన్‌ చేద్దాం. ఈసారి ఒక షో రీల్‌ వదులుదాం. అందులో డైలాగ్స్‌ ఉండవు అంటూ హరీశ్‌ శంకర్‌ తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ విూడియాలో వైరల్‌గా మారింది. షాక్‌, మిరపకాయ్‌ సినిమా తర్వాత రవితేజ, హరీశ్‌ శంకర్‌ కాంబోలో ఈ సినిమా వస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. రవితేజ ఈ చిత్రంలో అమితాబ్‌బచ్చన్‌ అభిమానిగా కనిపించనున్నాడు.