మాసివ్ అప్డేట్ : బాలయ్య “వీరసింహా రెడ్డి” రిలీజ్ డేట్ ఖరారు.!

టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ హీరో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న భారీ చిత్రం “వీరసింహా రెడ్డి”. తన గత చిత్రం “అఖండ” లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ సినిమా వస్తుడడంతో పైగా చాలా కాలం తర్వాత బాలయ్య నుంచి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఇసినిమా కావడంతో దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ అవైటెడ్ సినిమా మాస్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొల్పుకోగా ఇప్పుడు అయితే చిత్ర బృందం మైత్రి మేకర్స్ అంతే ఆసక్తిగా మారిన రిలీజ్ డేట్ పై మాసివ్ అప్డేట్ ని ఇప్పుడు ఇచ్చేసారు. ఇక వీరు అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు అనౌన్స్ చేశారు.

మరి దీనితో అయితే ఇక ఈరోజు నుంచి బాలయ్య మాస్ జాతరకు రోజులు అని చెప్పొచ్చు. ఇప్పటికే వచ్చిన టీజర్ లు మరియు ఫస్ట్ సింగిల్ సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇక ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా థమన్ ఎస్ సంగీతం ఇస్తున్నాడు అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.