జిన్నా సినిమా వల్ల కోట్ల రూపాయలు లాభాలు అందుకున్న మంచు విష్ణు?

మంచు విష్ణు మోహన్ బాబు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.అయితే ఈమధ్య కాలంలో మంచు కుటుంబం నుంచి ఎలాంటి సినిమాలు వచ్చిన పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.

ఈ విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా వల్ల మంచు విష్ణు కోట్ల రూపాయలు లాభం పొందారని తెలుస్తుంది. ఈశాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు నటించిన ఈ సినిమాలో సన్నీలియోన్ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించారు.ఇక ఈ సినిమాని సుమారు 15 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిర్మించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్దగా కలెక్షన్లను సాధించలేకపోయింది.అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆడియో హక్కులతో పాటు హిందీ రైట్స్ ద్వారా భారీగా లాభాలు పొందినట్టు సమాచారం.

ఇదివరకు మంచు విష్ణు నటించిన సినిమాలు హిందీలో ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.ఈ క్రమంలోనే ఈయన నటించిన సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ ఉండటం వల్ల జిన్నా సినిమాని కూడా ఏకంగా 10 కోట్ల రూపాయలకు హిందీ రైట్స్ కొనుగోలు చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో సన్నీలియోన్ ఉండటం వల్ల బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాని మంచిగా ఆదరిస్తారనే నేపథ్యంలో ఈ సినిమా హిందీ రైట్స్ భారీ ధరలకు అమ్ముడుపోవడం వల్ల విష్ణు కోట్ల రూపాయల లాభం పొందారని సమాచారం.