Samantha: సమంత తండ్రి కన్ను మూత… ఎమోషనల్ పోస్ట్ చేసిన సామ్!

Samantha: సినీనటి సమంత ఇంట్లో విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు . ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మనం మళ్లీ కలిసే వరకు, నాన్న అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజిని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి ముఖ్య పాత్ర పోషించారని గతంలో ఎన్నోసార్లు సామ్ చెప్పుకొచ్చింది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సామ్ తన తల్లిదండ్రులను కలిసేందుకు ప్రాధాన్యత ఇస్తుండేది. సినీరంగంలో తనకు ప్రతి క్షణం తోడు ఉండే తన తండ్రి మరణించడంతో సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అవుతున్నారు.

ఇక సమంత తండ్రి మరణం వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ సానుభూతి తెలియజేస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సమంతకు ఇలా వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో అభిమానులు ఈమెకు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు. తన మాజీ భర్త నాగచైతన్య ఇంట్లో తన పెళ్లి వేడుకలు జరుగుతూ సంతోషంతో ఉండగా మరోవైపు సమంత మాత్రం తన తండ్రి మరణంతో విషాదంలో ఉండిపోయారు.