మొదటిసారి షర్టు లేకుండా సందడి చేసిన మహేష్ బాబు.. వైరల్ అవుతున్న ఫోటో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మహేష్ బాబుకి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన అందానికి చిరునవ్వుకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.మహేష్ బాబుకు ముఖ్యంగా అబ్బాయిల కన్నా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.ఇకపోతే సాధారణంగా ప్రతి సినిమాలోని హీరోలు తమ సిక్స్ ప్యాక్ బాడీ చూపించడం కోసం షర్టు లేకుండా ఫైట్స్ సన్ని వేశాలలో నటిస్తూ ఉంటారు.

మహేష్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి విభిన్నమని చెప్పాలి. ఈయన కనీసం సినిమాలలో కూడా షర్టు లేకుండా ఎక్కడా కనిపించరు. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా బయట, తన సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ విధమైనటువంటి ఫోటోలను ఎప్పుడు షేర్ చేయలేదు. తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా మొదటిసారి తన ఒంటిపై షర్ట్ లేకుండా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటో చూసి ఆశ్చర్య పోవడమే కాకుండా ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

మహేష్ బాబు హెడ్ క్యాప్ ధరించి, స్విమ్మింగ్ పూల్ లో షర్ట్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలలో లైట్ బియర్డ్ లుక్ ఉన్నటువంటి ఈ ఫోటో పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది అభిమానులు ఈ ఫోటో పై స్పందిస్తూ మొదటిసారి మహేష్ బాబును ఇలా షర్ట్ లేకుండా చూస్తున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇలా మహేష్ బాబు షర్ట్ లేకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ లుక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఉండబోతుందా.. అని పెద్ద ఎత్తున అభిమానులు ఆరా తీస్తున్నారు.