లీక్ షాక్..అయినా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే..!

dont-believe-any-rumours-about-my-movie-with-prabhas-director-maruthi-01

ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న  చిత్రాల్లో ఫ్యాన్స్ లో ఫ్యాన్స్ ఏమాత్రం అంత ఆసక్తి కనబరచకుండా ఉన్న చిత్రం ఒకటి ఉంది. అదే దర్శకుడు మారుతీ తో అయ్యితే ప్లాన్ చేసిన సినిమా. కాగా ఈ సినిమా విషయంలో మొదటి నుంచీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆసక్తి లేదు కానీ దర్శకుడు మారుతీ మాత్రం అదే ఫ్యాన్స్ తో విజిల్ కొట్టించే పని లో ఉన్నాడని అర్ధం అవుతుంది.

ఏ హీరో ఫ్యాన్ అయినా కూడా తన అభిమాన హీరోని పాత రోజుల్లో ఎలా చూసామో అలాగే ఎన్నాళ్ళు అయ్యినా చూడాలి అనుకుంటాడు. అదొక ఆనందం అయితే ఈ వింటేజ్ ప్రభాస్ ని చూసి చాలా కాలమే అయిపొయింది. కానీ ఇపుడు మళ్ళీ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆ రేంజ్ ట్రీట్ ని మారుతీ అందిస్తున్నాడని అర్ధం అయిపొయింది.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి ఓ షాకింగ్ పిక్ లీక్ అయ్యింది. ఇందులో ప్రభాస్ ని చూస్తే కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ కి చాన్నాళ్ళకి గట్టి పండగే వచ్చేలా ఉందని అర్ధం అయ్యిపోతుంది. ఇక ఈ ఫోటో బయటకి రావడం వెంటనే వైరల్ అవ్వడం కూడా జరిగిపోయాయి.

దీనితో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు. కాగా ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. 
https://twitter.com/HailPrabhas007/status/1646799624341164033