చిరంజీవి కోసం లారెన్స్ మళ్ళీ వస్తున్నాడా.?

మెగాస్టార్ చిరంజీవిని దేవుడిగా కొలిచే చాలామంది కొరియోగ్రాఫర్లలో లారెన్స్ కూడా ఒకరు.! చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ చేశాడు లారెన్స్ కొరియోగ్రాఫర్‌గా.

ఇప్పుడైతే కొరియోగ్రఫీ దాదాపు మానేశాడు వేరే హీరోలకి లారెన్స్. మెగాస్టార్ చిరంజీవి కోసం గతంలో ‘ఖైదీ నెంబర్ 150’ కోసం కొరియోగ్రఫీ అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ వేరే హీరోలకి కొరియోగ్రఫీ చేసింది లేదు.

తాజాగా ఇప్పుడు.. ఇంకోసారి మెగాస్టార్ చిరంజీవి కోసమే, లారెన్స్.. కొరియోగ్రఫీ అందించబోతున్నాడట. ఇటీవల చిరంజీవిని లారెన్స్ ఈ విషయమై కలిసినట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. కేవలం ఓ పాటకి కొరియోగ్రపీ కోసమేనా.? దర్శకత్వం దిశగా ఏమన్నా చిరంజీవితో ఆలోచన చేస్తున్నాడా.? కాస్త స్పష్టత రావాల్సి వుందింకా ఈ విషయమై.!